Tuesday, October 9, 2001

అలకలు

అలకలు

నీ అధరపు ఎరుపు చూసి
తమలపాకు అలిగింది
తనను వేసుకోనందుకు
తనకు ఎరుపు రానందుకు

నీ మై గల రంగు చూసి
గంధకమ్ము కుమిలింది
తనను రాసుకోనందుకు
మైమరపు తనకు రానందుకు

చెక్కిలి గల తీరు చూసి
చందురుడు అడిగాడు
ధాతని తన జన్మని
నీ బుగ్గ పైన ఇమ్మని

సూదిలాంటి చూపు అంటి
సూదంటురాయంటున్నది
తనకన్నా ఆకర్షణ
నీ కంటికే ఉన్నదని