Tuesday, April 12, 2011

నిన్నూ పోనిచ్చెదనా సుందరరామా


మా సుందరరాముడికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రామకృష్ణ.

Wednesday, April 6, 2011

ఆశ

నీతో కలిసి టీ తాగాలనిపిస్తుంది.
ఎందుకు లేవు నాతో.
శంఖం లోంచి జారిపడే నీటి బొట్టుల్లా
జీవితపు అపురూప క్షణాలు ఎన్నో
ఒంటరి గుండెలోంచి
నువ్వు లేకుండానే జారిపోతున్నై.

ఎన్ని మాసాలైనా ఎన్ని మోసాలైనా
శిశిరమయ్యాక ఒస్తుందిగా వసంతం ఏదోరోజున
నాకున్న ఆశ గురించి చెప్పనా
చెప్పాక విని నవ్వకూడదు:

మరణమూ నువ్వూ ఒకేసారి ఒచ్చి నా ముందు నుంచుంటే
క్షణమైనా నువ్వు త్వరపడి
ఒక అడుగు నా ముందుకు వేస్తావుగా.