Saturday, July 17, 2010

గురుతుచుక్క

ఇన్నాళ్ళూ ఎదురుచూస్తే
ఇలా ఒస్తావా గుర్తుకు నువ్వు

చాపంతా పక్కను పరిచి
చూపేమో చుక్కలు దాటి
వర్షం చీకటి, కొవ్వొత్తి కాంతిలో
గురుతుచుక్క తడికంట్లో మెరిసే వేళ

చెలీ! ఇదేం అల్లరి!?

కుండపోతగా వాన
కాదు తుఫానేమో.
- మనసులో..

పెద్ద వర్షం వచ్చి వెలిసినట్లుంటుందేం నువ్వు మాట్లాడి వెళ్ళిపోతే?
వర్షం ఆగిపోయాక కూడా వేసే అందమైన మట్టి వాసనలా
నీ మాటలు ఇంకా నా వెన్నంటే ఉంటాయెం?

చినుకు చినుకుకీ చప్పట్లు కొట్టే పిల్లవాడిలా,
మాట్లాడే నీ కనురెప్పల ప్రతి కదలికకీ ఆహా! అనుకుంటాను.

ఒంటరి వేసవిలో తొలిసారి వర్షం పడితే
బీడు గుండెల్లోకి నిండుగా పీల్చుకున్న తడి
మొదటి వర్షం తొలి చినుకుకి
తడిసిన మనసు కురిపించే మధురమైన ఊహల మట్టి వాసనా

మురళికి జలుబు చేస్తే 'సా'  కి 'గా' పలుకుతుందా! అనే సందేహం
మనో ద్వారం కమాను స్పర్శకి నరం నరం 'కమాన్' అని కంపిస్తే
మనసు స గ మ ద ని - అని హిందోళం అవుతుందా!

ఎక్కడ్నుంచో దూకిపడే జలపాతం
వెచ్చని సాయంత్రం, చలేసే మధ్యాహ్నం
ఎప్పుడూ వినిపిస్తుండే గుర్తుపట్టలేని ఊహాగీతం
గుండెని తీసి మంచులో పెడ్తే కలిగే జిల్లుమనే భావం
ఆ మంచుపూల జల్లులో తడిసిన మనసుకేసే గడ్డకట్టేంత చలీ-

చెలీ! ఇదేం అల్లరి!?

(20/03/2006)

Thursday, July 15, 2010

గాలిపటం

పేర్లు రాసి ప్రాణం పోసి
ఎగరేసిన గాలిపటం
ఎన్ని ఊళ్లు తిరిగిందో
ఏ గుళ్ళో వాలిందో

దాని వెంటే పరిగెడుతుంటే
గడప ఇదని గమ్యం ఇటని
ముందే మదికి తెలిసేనా
నిన్నే చివర చేరినా

Saturday, May 22, 2010

నువ్వు.

యోగులు హృదయాల్లో వెలిగించుకున్న దీపం నీ నవ్వు.
నాకెలా దొరుకుతుంది? ప్రపంచాన్ని వెతికే నాకు?
అంటాడు చెలం.
నేను కూడా నిన్ను నా హృదయంలో దాచుకున్నాననుకున్నాను.
కళ్ళలో ఉంటావు తెల్సా.

ప్రతి ఆకు, ప్రతి కొమ్మా, ప్రతి చిగురూ
ఎంతో అందంగా, అద్భుతంగా కనిపించేవి.
జీవం లేనట్టు ఉన్నాయి రా. నువ్వు లేకపోతే. :(

ఈ కాలేజీ age సినిమాలు, ఏరా, పోరా స్నేహాలు ఎక్కువైపోయి cheap అయిపోయింది కాని,
నిన్ను నేను ఎంత ప్రేమగా, ప్రాణంగా,
గుండెచప్పుడు వింటూ శ్వాస పంచుకునేంత దగ్గరగా
రా.. రా.. అంటానో తెల్సా.
నువ్వంటే ప్రాణం రా. పిచ్చి కన్నా.

నీకు చాలా secrets చెప్పాలి.
నాలోనే దాచుకునీ దాచుకునీ
చాలా బరువైపోతోంది...

యోగుల హృదయాల్లో, వేణువు చిల్లుల్లో
ఉండే దీపం, రాగం నాకు తెలీవు కానీ,

నిద్ర పట్టని రాత్రుల్లో, ఎర్రబడ్డ నేత్రంతో
దిండు మీద ఇంకిన కంటిబొట్టు నువ్వు.
నీకై కన్న కలల్లో, లోకం మరచిన వేళల్లో
నన్నే నేను కొరుక్కున్న పంటి గాటు నువ్వు.

గుండెలో వేసుకున్న పచ్చబొట్టు రా నువ్వు.

Friday, May 21, 2010

తనుంటే..

చెప్పానా నీకు?
తను ఉంది, పక్కనే ఉంది.
ఎక్కడో లేదు, నా పక్కనే-
ఇదో కనిపిస్తోందా? అని.
అడిగానా నిన్ను?

టాగోర్ అన్నట్టు,
I would ask for still more,
if I had the sky with all its stars,
and the world with its endless riches;
but I would be content with
the smallest corner of this earth
if only she were mine.
అని.

అనుకున్నాం ఇద్దరం
ఇంకెవరూ ఒద్దు.
నువ్వు, నేను, ఒక lsland
nec plus ultra అని.

తడిసిన మట్టికుండ చాలదా
తాగటానికైనా గులాబీకైనా
రెండు జామకాయలు మూడు అట్టిపళ్ళు
చాలుకదా lunch ఐపోయింది.

ఇసుకలో పిచ్చుక గూళ్ళు
బంకమట్టి శివలింగం

అడపాదడపా పేర్లు రాసుకోటానికి
సూది అంచు పెంకుముక్క.

'4 feet' నేల చాలదా. తనుంటే.